Home తెలంగాణ భారతి నగర్ డివిజన్‌లో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పర్యటన

భారతి నగర్ డివిజన్‌లో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పర్యటన

321
0

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్.ఐ.జీ కాలనీ, మ్యాక్ సొసైటీ కాలనీలలో ఈరోజు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి పనులకు కట్టుబడి ఉన్నామని, ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎల్.ఐ.జీ కాలనీలో వాటర్ డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఓట్లేట్ సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మ్యాక్ సొసైటీ కాలనీలో జరుగుతున్న డివైడర్ పనులు, ఈ.ఎస్.ఈ రోడ్‌లో చైన్ లింక్ మెష్ పనులను పర్యవేక్షించారు. కొత్త ప్రతిపాదనలు అవసరమున్న చోట వెంటనే పంపాలని సూచించారు. ఎల్.ఐ.జీ కాలనీలో సి.సి. రోడ్లు, మ్యాక్ సొసైటీ కాలనీలో వాటర్ డ్రైన్ పనుల కోసం ప్రపోజల్స్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈ దేవేందర్, ఏ.ఈ ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here