Home తెలంగాణ నారింజ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఇరిగేషన్ ఈఈ 

నారింజ ప్రాజెక్ట్ ను సందర్శించిన ఇరిగేషన్ ఈఈ 

300
0

TGN NEWS (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ను స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల మూలంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీరు వదిలే సమయంలో దిగువన ఉన్న గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. ఎఫ్ టీ ఎల్ ను మెయింటైన్ చేస్తూ నీటి సామర్థ్యం తక్కువ కానట్లు ఎప్పటికప్పుడు వాకబు చేయాలన్నారు. ఈఈ వెంట డిప్యూటీ ఈఈ జనార్దన్ రావు, ఏఈలు శ్రీనివాస్, జానకిరామ్, శ్రీనివాస్, సిబ్బంది రఘు, ప్రసాద్ లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here