Home తెలంగాణ జహీరాబాద్ పట్టణంలో కొండముచ్చులను పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది

జహీరాబాద్ పట్టణంలో కొండముచ్చులను పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది

317
0

TGN NEWS (జహీరాబాద్): గత వారం రోజులుగా జహీరాబాద్ పట్టణంలోని బాగా రెడ్డిపల్లి, శాంతినగర్, హౌసింగ్ బోర్డ్, హమాలి కాలనీలలో కొండముచ్చులు ఎల్ల మధ్యకు వచ్చి పలువురికి గాయపరిచాయి. ఆయా కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో గురువారం ఫారెస్ట్ అధికారులు 14 కొండముచ్చులను పట్టుకొని బంధించారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కొండముచ్చులను పట్టుకోవడానికి వచ్చిన జహీరాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ లు కృష్ణమ్మ, కిరణ్ కుమార్ ,బిటి ఆఫీసర్లు భవాని, సంజీవ్ లకు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత, ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్ , కార్యవర్గ సభ్యులు ప్యార్ల దశరథ్, మహమ్మద్ ఫసి,కాలనీ వాసులు కడమంచి ఎల్లయ్య, కళ్లెం శ్రీనివాస్ ,పస్తం శ్రీనివాస్, తదితరులు సహకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here