Home రాజకీయం ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

1
0

తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ నేత, పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు న్యాయపోరాటానికి దిగారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు (క్వాష్) చేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.

 

యూట్యూబ్ ఇంటర్వ్యూ సాకుతో ఫ్లాట్‌కు పిలిపించి, ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను వేధించారంటూ ఈ నెల 26న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలి ఆరోపణల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా… ఈ వ్యవహారంపై రేగా కాంతారావు ఘాటుగా స్పందించారు.

 

తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, కేవలం రాజకీయ ప్రతీకారంతోనే తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ కుట్ర పన్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో బనాయించిన ఈ కేసు నుంచి తనకు ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. నేటి విచారణలో న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here