Home తెలంగాణ తూప్రాన్ డిఎస్పి సబ్ డివిజన్ పరిధి సిఐలు మరియు ఎస్ హెచ్ ఓలతో నేరాలపై సమీక్ష

తూప్రాన్ డిఎస్పి సబ్ డివిజన్ పరిధి సిఐలు మరియు ఎస్ హెచ్ ఓలతో నేరాలపై సమీక్ష

351
0

TGN NEWS (తూప్రాన్): ఆగస్టు నెల క్రైమ్ రివ్యూ సమావేశాన్ని డీఎస్ప సబ్‌ డివిజన్ పరిధిలోని సీఐలు మరియు ఎస్‌హెచ్ఓలతో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ నేరాలపై సమీక్ష జరిపి, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమైన సూచనలు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ విచారణలో ఉన్న కేసులు, న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్‌లో ఉన్న కేసులు మరియు నాన్ బైలబుల్ వారెంట్లను త్వరితగతిన తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరిగా పూర్తి చేయాలని, ఇవి నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.అలాగే గంజాయి, జూదం మరియు ఇతర అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, ఇలాంటి వాటిని నిరోధించడానికి పహారా బలపరచాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఐలు మరియు ఎస్‌హెచ్ఓలు తమ తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల పరిస్థితులను వివరించి, డీఎస్పీ సూచనల మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఐ తూప్రాన్ రంగ కృష్ణ, సిఐ రామయంపేట్ వెంకట్ రాజా గౌడ్, సీఐ నర్సాపూర్ జాన్ రెడ్డి, పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here