TGN NEWS (మనోహరాబాద్) : మండల పరిధిలోని దండుపల్లి గ్రామంలో గల బాల్యం ద స్కూల్ పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు, విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేశారు.ఆటపాటలతో విద్యార్థులు తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తలారి నర్సింలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సాంప్రదాయాలు, కట్టుబాటులు గుర్తు చేసే విధంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు కమలాకర్ రెడ్డి, గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
