TGN NEWS (తెల్లాపూర్): మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్‌నగర్ ఎంఐజి నుండి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వరకు ఎన్నో ఏళ్లుగా గుంతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన రహదారి నేడు సొంత నిధులతో మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు లచ్చిరాం, బాబ్జి ముందడుగు వేసి సొంత నిధులతో పనులను పూర్తిచేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బిహెచ్ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ మహిళలు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ సర్పంచ్ సోమిరెడ్డి మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్లుగా బిహెచ్ఎల్ యాజమాన్యాన్ని కోరినా ఫలితం రాలేదు. చివరికి ప్రత్యేక సమావేశం నిర్వహించి అంగీకారం తెచ్చి రోడ్డు పనులు పూర్తి చేయించాం ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కాలనీ లోని అందరి సహకారంతో పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రోడ్ క్యూరింగ్ కోసం నాలుగైదు రోజులు ప్రజలు సహకరించాలని క్యూరింగ్ అయిన వెంటనే రోడ్డు పునః ప్రారంభిస్తామని అన్నారు. మాజీ కౌన్సిలర్ లచ్చిరాం మాట్లాడుతూ, “ఈ పనికి సహకరించిన ఎంఐజి కాలనీవాసులు, బిహెచ్ఎల్ యాజమాన్యం, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు. విమర్శలు వచ్చినా పార్టీలకతీతంగా మేము ముందుండి వేసాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, బిహెచ్ఎల్ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
