Home క్రైం బహదూర్‌పల్లిలో దారుణం! ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..

బహదూర్‌పల్లిలో దారుణం! ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..

326
0

– ఓ అధికార పార్టి నేతకు చెందిన భవనంలో కార్మికుడి అనుమానాస్పద మృతి

– సెంట్రింగ్ పని చేసే కార్మికుడు ఉరివేసుకొని మృతి

– 48 గంటల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి నిర్మిస్తున్న భవనంలో పనిచేస్తున్న శేఖర్ (55) అనే సెంట్రింగ్ కార్మికుడు అనుమానాస్పదంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన రెండు రోజుల క్రితమే జరిగినా బయటకురావడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

బహదూర్‌పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్ పక్కన జరుగుతున్న భవన నిర్మాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మృతి చెందిన విషయాన్ని భవన యజమాని గోప్యంగా ఉంచినట్లు అందుకు పోలీసులు కూడా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా ఆత్మహత్యా..? లేక హత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here