TGN News (కుత్బుల్లాపూర్): దేవి శరన్నవరాత్రుల సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శోభాయమానంగా జరుగుతున్న దుర్గామాత పూజా కార్యక్రమాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. భగత్ సింగ్ నగర్, బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసారు.

కార్యక్రమంలో కావాలి గణేష్, నరసింహ రెడ్డి, ప్రేమ్ కుమార్, సాదు యాదవ్, కుమార్ యాదవ్, పృద్వీ, శ్రీశైలం యాదవ్, గజ్జ జగన్ ముదిరాజ్, మహేష్, కాంగ్రెస్ స్థానిక నాయకులు, యువత, భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
