Home తెలంగాణ అమీర్‌పేట్‌లో అగ్నికీలలు.. షాపింగ్ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టిన మంటలు

అమీర్‌పేట్‌లో అగ్నికీలలు.. షాపింగ్ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టిన మంటలు

11
0

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైత్రివనం సమీపంలోని KSR ఫ్యాషన్స్ ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రెండో అంతస్తులో ప్రారంభమైన మంటలు క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి.

అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అదనపు ట్యాంకర్లను కూడా రంగంలోకి దించారు.

దుస్తుల నిల్వలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. పక్కనే ఉన్న హర్ష మెస్‌తో పాటు మరికొన్ని వ్యాపార సంస్థలకు కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here