Home తెలంగాణ ఏపీలో వారికి కూడా తల్లికి వందనం..

ఏపీలో వారికి కూడా తల్లికి వందనం..

0

“తల్లికి వందనం” పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అనాధ పిల్లలకు సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై చర్చించారు. అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం అందించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు అనాథ పిల్లల సంరక్షకుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సరంక్షకులు ఎవరూ లేకపోతే జిల్లా కలెక్టర్లకు నగదు పంపాలని, వారి ద్వారా పంపిణీ చేయాలన్నారు.

 

అనాథ పిల్లల అకౌంట్లో..

అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానంపై కూడా పరిశీలన చేపట్టాలని లోకేష్ సూచించారు. ఏపీలో స్కూళ్లు మొదలుకావడంతో త్వరలోనే తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. జులై మూడో వారంలో పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు ఈ నిధులను స్వయంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ దీనికి ఆమోదముద్ర కూడా వేసింది. ప్రస్తుతం లబ్దిదారుల ఎంపిక జరుగుతుండగా.. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఆధార్ పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత లబ్దిదారుల జాబితా విడుదల చేయనున్నారు.

 

ప్రతీ ఏడాది రూ.15 వేలు..

ఈ పధకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ప్రభుత్వం జమ చేస్తోంది. రూ.13 వేలు తల్లుల అకౌంట్లో వేస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటుంది. అటు ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజు దోపిడీపై కూడా అధికారులతో లోకేష్ మాట్లాడారు. ప్రైవేట్ స్కూళ్లల్లోని ఫీజులను అక్కడ బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పబ్లిక్ డొమైన్‌లో కడా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకు సంబంధించి అనవసరమైన నిబంధనలను తొలగించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న 2.03 లక్షల మంది విద్యార్థులకు ద్యార్థి మిత్ర కిట్లను అందిస్తున్నామని లోకేష్ తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version