గురువారం పెనుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్మల్ (18) అనే యువకుడు మృతి చెందాడు. పెనుకొండ కొండపైకి బైకుపై వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలైన అక్మల్‌ను అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.