ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూన్ 18) విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మేరకు సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రాసిన సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలను ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 59 శాతం మంది, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విజయం సాధించిన విద్యార్ధులకు, అలాగే మార్కులు మెరుగుపరుచుకున్న విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసెజ్ చేసి ఫలితాలు చిటికెలో పొందవచ్చు.
