Home తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో మరో ఎబోలా అనుమానిత కేసు.. అప్రమత్తమైన వైద్యశాఖ

గాంధీ ఆస్పత్రిలో మరో ఎబోలా అనుమానిత కేసు.. అప్రమత్తమైన వైద్యశాఖ

0

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో ఎబోలా అనుమానిత కేసు నమోదు కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనే వ్యక్తిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో అతడిని ప్రత్యేక చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సుడాన్ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో అనుమానాస్పద లక్షణాలు గుర్తించిన అధికారులు వెంటనే వైద్య చర్యలు చేపట్టారు.

ఇప్పటికే సుడాన్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో కూడా ఎబోలా లక్షణాలు గుర్తించగా, తాజా కేసుతో గాంధీ ఆస్పత్రిలో ఎబోలా అనుమానితుల సంఖ్య రెండుకు చేరింది. ఇద్దరికీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version