Home తెలంగాణ పాతబస్తీ మెట్రోపై బిగ్ అప్డేట్.. ప్రాజెక్టుకు లైన్ క్లియర్..

పాతబస్తీ మెట్రోపై బిగ్ అప్డేట్.. ప్రాజెక్టుకు లైన్ క్లియర్..

0

పాత బస్తీ మెట్రోపై బిగ్ అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుపై ఎప్పటినుంచో ఫోకస్ పెట్టింది. వేగవంతంగా దీనిని పట్టాలెక్కించే విధంగా అడుగులు వేస్తోంది. సెకండ్ ఫేజ్‌లో భాగంగా పాత బస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టనుండగా.. ఇందుకు సంబంధించి పనులు వేగవంతమయ్యాయి. అందులో భాగంగా తాజాగా మెట్రో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ కోసం భూసేకరణ పనులు దాదాపుగా పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం మొత్తం 888 ఆస్తులు సేకరించాల్సి ఉండగా.. 825 ఆస్తుల సేకరణ పూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు కావాల్సిన భూమిలో దాదాపు 93 శాతం భూసేకరణ పూర్తయినట్లు పేర్కొన్నారు.

నష్టపరిహారం చెల్లింపు
ఈ భూమిని ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకోగా.. ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వం పరిహారం కింద ఇప్పటికే రూ.820 కోట్లు చెల్లించింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తులలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. దీంతో పాటు టెండర్లను కూడా ఆహ్వానించారు. పనుల పర్యవేక్షణ, సాంకేతిక సలహాల కోసం కన్సల్టెన్సీ నియామకం కోసం టెండర్లను పిలిచారు. త్వరలోనే టెండర్ ఓకే చేయనుండగా.. అనంతరం నిర్మాణ పనులు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. మెట్రో అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో పాతబస్తీ రూపురేఖలే మారనున్నాయి. భూసేకణ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో మెట్రో ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుందని చెప్పవచ్చు. దాదాపు 10 ఆస్తులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తుండగా.. మరికొన్ని స్థలాలకు సంబంధించి వివాదాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

7.5 కిలోమీటర్ల మేర పాతబస్తీ మెట్రో
పాతబస్తీ మెట్రో 7.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు ఉంటుంది. ఎంజీబీఎస్ నుంచి దారుల్ షిపా, పురానీహవేలీ, అలీజా కోట్ల, హరిబౌలి, షాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమా మీదుగా చంద్రాయణగుట్ట వరకు ఉంటుది. మార్గం మధ్యలో దాదాపు 105 చారిత్రక, మతపరమైన కట్టాలు ఉన్నాయి. వీటికి హాని కలగుండా ఆస్తులను సేకరణ, డిజైన్ రూపకల్పన చేశారు. అయితే మెట్రో సేకరిస్తున్న భూముల్లో కొన్ని వక్ప్ ఆస్తులు ఉన్నాయి. తమకు తెలియకుండానే వీటిని కొనుగోలు చేశామని ప్రస్తుత భూయజమానులు చెబుతున్నారు. దీంతో దీనిపై వివాదం చెలరేగగా.. వీటి పరిష్కారానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ మెట్రోను ఎల్‌అంట్‌టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి పనులు మరింత వేగవంతం కానున్నాయి. మెట్రో నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. దీని ఆధ్వర్యంలో మెట్రో నిర్వహణ జరగనుంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version