Home తెలంగాణ ఓటరు డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ ఫెయిలా?.. రాష్ట్రంలో చివరి స్థానంలో సిటీ.. ‘సర్’ ప్రక్రియపై విమర్శలు

ఓటరు డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ ఫెయిలా?.. రాష్ట్రంలో చివరి స్థానంలో సిటీ.. ‘సర్’ ప్రక్రియపై విమర్శలు

0

ప్రత్యేక ఓటరు నమోదు సవరణ (SIR) ప్రక్రియలో గ్రేటర్ హైదరాబాద్ వెనుకబడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా 34.7 శాతం డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలో చివరి స్థానంలో ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు కూడా తక్కువ పురోగతితో నిలిచాయి.

నగరంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ జిల్లాల కంటే తక్కువ డిజిటలైజేషన్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్, హెల్ప్‌డెస్క్‌ల పనితీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌వోలు పోలింగ్ కేంద్రాలకే పరిమితమవుతున్నారని, ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరించడం వల్ల ప్రక్రియ వేగంగా సాగుతోందని సమాచారం.

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరింత పర్యవేక్షణ పెంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ లేదా సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించలేదు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version