Home జాతీయం ప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

ప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

0

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.

కొత్తగా నియమితులైన వారిలో సీనియర్ న్యాయవాది వి. మోహనతో పాటు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్, జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు. వీరిలో వి. మోహన ఒక్కరే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతున్నారు.

వి. మోహన చేరికతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బలం మరింత పెరగనుండగా, పెండింగ్ కేసుల పరిష్కారానికి కూడా వేగం చేకూరే అవకాశముందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version