ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘సింగ్ గీతం’ చిత్రం జూన్ 12న విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ వెర్షన్‌లో థియేటర్ వెర్షన్ కంటే భిన్నమైన మార్పులు ఉంటాయని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు. క్లైమాక్స్‌లోని CGని మరింత మెరుగుపరచాలని, భవిష్యత్తు రోజులకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌కు డిజిటల్ హక్కులు విక్రయించినట్లు సమాచారం.
