Home తెలంగాణ మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో ఎగసిపడుతున్న మంటలు

మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో ఎగసిపడుతున్న మంటలు

39
0

మేడ్చల్ జిల్లా: దేవరయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్‌కు చెందిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం ప్రకారం.. గోదాంలో సుమారు రెండు గంటలుగా మంటలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

మంటల తీవ్రత కారణంగా భారీగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో గోదాం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు కూడా అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here