ఢిల్లీలో సోమవారం జరిగిన ‘మైండ్‌మైన్ సమ్మిట్ 2026’లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, అయితే వృద్ధిని తేలిగ్గా తీసుకోకూడదని అన్నారు. దీర్ఘకాలిక వృద్ధికి నిరంతర ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవస్థల బలోపేతం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా, స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధికి బలమైన సంస్థలు, సమర్థవంతమైన విధానాలు, పటిష్ఠమైన మద్దతు వ్యవస్థలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు

