Home జాతీయం ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12వ వార్షికోత్సవం

ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12వ వార్షికోత్సవం

11
0

ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12వ వార్షికోత్సవం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్‌ఎస్‌ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్‌ నేత అనిల్‌ బైరెడ్డి ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం మేరకు ఆస్ట్రేలియా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని అనిల్‌ బైరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలోని ఇతర నగరాల్లోనూ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తామని వెల్లడించారు.

గత 12 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని ఎన్నారై బీఆర్‌ఎస్‌ నాయకులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here