Home ఆంధ్రప్రదేశ్ పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం

0

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి నిరాకరించడంపై స్పందించిన ఆయన, తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్, కొన్ని రాజకీయ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, పవన్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని, అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఎవరూ మాట్లాడరాదని అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఈ పరిణామాలతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేచినట్లు కనిపిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version