TG EAPCET 2026 ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఒకే కళాశాలలో తమ కోర్సును మార్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం కేంద్రీకృత ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియను ప్రకటించింది.
కీలక తేదీలు ఇవే
ఆగస్టు 12, 13: ఇంటర్నల్ స్లైడింగ్ కోసం వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 15: విద్యార్థులు నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు
ఆగస్టు 16, 17: కొత్త కోర్సులో సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకోవాలి. సీటు కేటాయింపు అనంతరం అలాట్‌మెంట్ ఆర్డర్‌తో నిర్ణీత తేదీల్లో కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
స్పాట్ అడ్మిషన్లపై త్వరలో వివరాలు
మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఆగస్టు 16న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. అర్హత, సీట్ల భర్తీ విధానం, అవసరమైన పత్రాలు తదితర వివరాలను విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
విద్యార్థులు చివరి తేదీలను గమనించి వెబ్ ఆప్షన్లు, రిపోర్టింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం.