Home తెలంగాణ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు : సిద్దిపేట సిపి విజయ్...

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు : సిద్దిపేట సిపి విజయ్ కుమార్

0

TGN NEWS (సిద్దిపేట): ఎన్నికల మోడల్ కోడ్ అమలులో ఉన్నందువలన ఎవరైనా కోడును ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవించడం, పేకాట ఆడడం చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సివిల్ , క్రిమినల్ కేసులలో ఎవరైనా సెటిల్మెంట్ దండాలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియామావళిని పాటించాలని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్దిపేట సీపీ కార్యాలయంలో సీపీ విజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 94 గ్రామపంచాయతీలను సమస్యాత్మక గ్రామపంచాయతీలుగా గుర్తించడం జరిగిందని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎవరైనా ఒక్క రూపాయి ఇవ్వవద్దు.ఇది ఉచితంగా జరుగాలి , డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. బాదిత మహిళల కోసం భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version