Home తెలంగాణ మానవత్వం చాటుకున్న బాసురేగడి కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సుధాకర్

మానవత్వం చాటుకున్న బాసురేగడి కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సుధాకర్

0

TGN NEWS (మేడ్చల్): సరదాగా చాయ్ తాగేందుకు వెళ్లిన ఇద్దరు సోదరులకు రెండున్నర తులాల బంగారు గొలుసు దొరికింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి మైసమ్మలో ఆదివారం జరిగింది. కుంటాల నవీన్ కుమార్, కుంటాల అనిల్ కుమార్ సోదరులు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరే గడిలో నివాసం ఉంటారు వారికి సమీపంలో ఉన్నటువంటి గండి మైసమ్మ వద్ద ఉన్న పిస్తా హౌస్ లో చాయ్ తాగేందుకు వెళ్లగా వారికి రెండున్నర తులాల బంగారు గొలుసు దొరికింది. ఈ విషయాన్ని గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుకు తెలియజేసారు. మారేపల్లి సుధాకర్ అలాగే సోదరులు కుంటాల నవీన్ కుమార్, కుంటాల అనిల్ కుమార్ కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డికి బంగారు గొలుసును అప్పచెప్పారు. అనంతరం పోలీసులు గొలుసు పోగొట్టుకున్న వారిని పిలిపించి రెండున్నర తులాల బంగారు గొలుసును అందజేశారు. మానవతా దృక్పథంతో దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి మానవత్వం చాటుకున్న వారిని పోలీసులు అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version