Home తెలంగాణ కుమారి ఆంటీ అదిరిపోయే ఆఫర్.. సినిమా టికెట్ చూపిస్తే రూ.100 డిస్కౌంట్!

కుమారి ఆంటీ అదిరిపోయే ఆఫర్.. సినిమా టికెట్ చూపిస్తే రూ.100 డిస్కౌంట్!

0

హైదరాబాద్‌ స్ట్రీట్‌ ఫుడ్‌తో సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించిన వినూత్న ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా టికెట్‌ చూపిస్తే తన ఫుడ్‌ స్టాల్‌లో బిల్లుపై రూ.100 డిస్కౌంట్‌ ఇస్తానని కుమారి ఆంటీ ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘పాంచాలి పంచభర్తృక’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె ఈ ఆఫర్‌ను వెల్లడించారు. థియేటర్‌లో సినిమా చూసిన తర్వాత టికెట్‌ను తన ఫుడ్‌ కౌంటర్‌కు తీసుకొస్తే భోజనం బిల్లులో రూ.100 తగ్గిస్తానని తెలిపారు.

అందరూ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కుమారి ఆంటీ కోరారు. ఈ ఆఫర్‌ సినిమాకు ప్రచారంతో పాటు తన ఫుడ్‌ వ్యాపారానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. ఆమె మార్కెటింగ్‌ ఐడియాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన సినీ ప్రయాణంపై కుమారి ఆంటీ భావోద్వేగంగా స్పందించారు. తాను సినిమాల్లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదని, సోషల్ మీడియా కారణంగానే ఈ అవకాశం దక్కిందని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గంగ సప్తశిఖర, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్‌ నటుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. రాయల్‌ థ్రోన్‌ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్లపై వెంకట్‌ దుగ్గిరెడ్డి, రాజ్‌ పవన్‌ శ్రీకాంత్‌ సెట్టివారి, సాయినాథ్‌ మణ్యం నిర్మించారు. రోల్‌ రైడా, జెమినీ సురేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version