Home తెలంగాణ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటలు

0

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న 68,771 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,888 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version