TGN NEWS (మేడ్చల్): ర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుమల తిరుపతి దర్శనం అనంతరం మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ కలిసి కేటీఆర్‌ను పార్టీ కార్యాలయంలో కలిసి, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ నాయకులతో చర్చించారు. పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
అదేవిధంగా ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా పార్టీ నాయకులు చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయడంతో పాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ నాయకులకు పిలుపునిచ్చారు.






