తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మురళి , ఎం ఆర్ సి వద్ద ఎంఈఓ బాలరాజ్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏడిఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద పిఆర్ డిప్యూటీ ఈ ఈ అమరేశ్వర్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ కృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయురాలు లలితాదేవి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండల వ్యాప్తంగా పాఠశాలల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మాజీ సర్పంచ్ వేంకటేశ్వర రెడ్డి, పిఏసీఎస్ సొసైటీ వైస్ ఛైర్మన్ చిలుముల చిన్నం రెడ్డి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గా గౌడ్ , ముదిరాజ్ సంగం మండల అధ్యక్షుడు మటూరి శాకయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా , మాక్బుల్ ,పాషా,వెంకటేశం, మాజీ ఏస్ఎంసి చైర్మన్ జగన్, తదితరులు పాల్గొన్నారు.
