రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న మండల ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వస్థ నారీ – శక్తివంత కుటుంబం” అభియాన్ కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్, హాస్పిటల్ డాక్టర్ కల్పన మరియు వారి సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్పనగేష్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, ఆరోగ్య సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, యువతులలో రోగ నిర్ధారణ, పోషకాహార లోపం నివారణ, అనీమియా తగ్గింపు, శానిటేషన్, మెన్స్ట్రుయల్ హైజీన్ పై ప్రత్యేక అవగాహన కల్పించనున్నామని తెలిపారు.“ఆరోగ్యవంతమైన తల్లి – ఆరోగ్యవంతమైన పిల్లలు కుటుంబం, సమాజం శక్తివంతం కావడానికి మహిళ ఆరోగ్య సంరక్షణ కీలక ఆధారం” అని కార్పొరేటర్ స్పష్టం చేశారు.
