Home తెలంగాణ గీతం విశ్వవిద్యాలయంలో వాహనాల రూపకల్పన, తయారీపై అధ్యాపక వికాస కార్యక్రమం విజయవంతం

గీతం విశ్వవిద్యాలయంలో వాహనాల రూపకల్పన, తయారీపై అధ్యాపక వికాస కార్యక్రమం విజయవంతం

0

TGN NEWS (పటాన్ చేరు): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “ఫ్యూజన్ 360 యొక్క అధునాతన లక్షణాలు” అనే శీర్షికతో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (FDP) విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం 17వ తేదీతో ముగిసింది. హైదరాబాద్‌లోని డిజైన్ ల్యాబ్స్ నుంచి ఆటోడెస్క్ ఫ్యూజన్ శిక్షకుడు అజయ్ కుమార్ రెడ్డి ప్రధాన వక్తగా పాల్గొని, అసెంబ్లీ పరిమితులు, ఈవెంట్ సిమ్యులేషన్స్, థర్మల్ స్ట్రెస్‌లు, జనరేటివ్ డిజైన్ క్రియేషన్, 3D ప్రింటింగ్, యానిమేషన్ & రెండరింగ్, సర్ఫేస్ మోడలింగ్ వంటి విస్తృత మాడ్యూళ్లపై శిక్షణ ఇచ్చారు. ప్రతి సెషన్ ప్రశ్నోత్తరాలతో ముగియగా, అధ్యాపకులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌తో ఆచరణాత్మకంగా అభ్యాసం చేసి తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. కార్యక్రమం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి పర్యవేక్షణలో, సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ పున్నా ఈశ్వరయ్య సమన్వయంలో జరిగింది. ముగింపు వేడుకలో పాల్గొన్న అధ్యాపకులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. పలువురు అధ్యాపకులు ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమైందని అభిప్రాయపడ్డారు. గీతం – విన్ విజన్ ఐ హాస్పిటల్ అవగాహన ఒప్పందం. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉద్యోగులకు నాణ్యమైన కంటి సంరక్షణ సేవలు అందించడానికి విన్ విజన్ ఐ హాస్పిటల్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం –గీతం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వార్షిక కంటి పరీక్షలు (గ్లాకోమా, కంటి శుక్లం, రెటీనా స్క్రీనింగ్ సహా) నిర్వహించనున్నారు. శస్త్రచికిత్సలు, మందులు, కళ్లద్దాలు తక్కువ రుసుముతో అందించబడతాయి. గీతం ప్రాంగణంలోనే స్క్రీనింగ్ క్యాంపులు, డిజిటల్ ఐ స్ట్రెయిన్ నివారణ, కంటి సంరక్షణపై వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version