TGN NEWS (మేడ్చల్ ): నూతనంగా నియామకం అయిన మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సన్మానించారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో నూతన కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానిధిగా ఉండే జర్నలిస్టుల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి రావాలన్నా జర్నలిస్ట్ వల్లే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకట్, ఉపాధ్యాక్షులు ఖాజా, మాజీ అధ్యక్షుల మహేష్, సభ్యులు గోపాల్ విశ్వ, ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
