Home తెలంగాణ మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

0

TGN NEWS (పటాన్ చేరు): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడ బీఎస్ఆర్ కాలనీ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ – దేశానికి అహర్నిశలు సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం పురస్కరించుకుని సేవా కార్యక్రమాల భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. మోదీపై ఉన్న అభిమానంతో వంద మందికి పైగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకు సర్టిఫికేట్‌లు అందజేశారు. “రక్తదానం ఒక మహత్తరమైన సేవ. అవసరమైన ప్రాణాలను రక్షించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి” అని గోదావరి హర్షం వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version