Home తెలంగాణ టీజీ20లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. తొలి సీజన్ ట్రోఫీ సొంతం!

టీజీ20లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. తొలి సీజన్ ట్రోఫీ సొంతం!

11
0

తెలంగాణ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన టీజీ20 లీగ్‌కు తొలి ఛాంపియన్ దొరికింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి చరిత్రలో తొలి టీజీ20 టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్‌ను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. యశ్వీర్ గౌడ్ స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టగా, దేవ్ మెహతా, అజయ్ దేవ్ గౌడ్ అద్భుత బౌలింగ్‌తో రాణించారు. మికిల్ జైస్వాల్ 65 పరుగులతో పోరాడినా, ఖమ్మం జట్టు 157 పరుగులకే పరిమితమైంది.TG20 first champion Hyderabad grand victory over Khammam in the final

లక్ష్య ఛేదనలో కెప్టెన్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అనంతరం వైష్ణవ్ రెడ్డి 41 నాటౌట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, ప్రణవ్ వర్మతో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును 17.3 ఓవర్లలోనే విజయానికి చేర్చాడు.

తొలి టీజీ20 ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు రూ.1 కోటి ప్రైజ్ మనీ లభించగా, ఖమ్మం ఏసెస్‌కు రూ.50 లక్షలు దక్కాయి. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ హైదరాబాద్ ఆటగాళ్లకే దక్కడం ఈ జట్టు ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here