Home తెలంగాణ ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’.. జూలై 17 నుంచి స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ‘మా ఇంటి బంగారం’.. జూలై 17 నుంచి స్ట్రీమింగ్!

10
0

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలై నెల రోజులు పూర్తికాకముందే డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవడం విశేషంగా మారింది.

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్నాయి. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, కథానాయిక ప్రాధాన్యమున్న తెలుగు సినిమాల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్వర్ణ అనే అనాథ యువతి పాత్రలో సమంత నటనతో పాటు ఆమె యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.

సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమా జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, అనూహ్యంగా జూలై 17నే స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం.

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని జియోహాట్‌స్టార్‌లో ఇంటి వద్దే వీక్షించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here