Home తెలంగాణ దుండిగల్ ముసిపాలిటీలో అక్రమ నిర్మాణాల జోరు…!

దుండిగల్ ముసిపాలిటీలో అక్రమ నిర్మాణాల జోరు…!

361
0

TGN NEWS (దుండిగల్):  మున్సిపల్ పరిధిలో అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవటం చూస్తుంటే భారీగా ముడుపులు అందుతున్నాయేమో అని పలువురి నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణానికి పొందిన అనుమతుల ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టేలా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి. టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ( చైన్ మెన్ )లు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి అధికారిని దృష్టికి తీసుకొచ్చి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు బిన్నంగా దుండిగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ వ్యవహరిస్తుందని, భవన నిర్మాణ దారులకు అధికారులే సహకరిస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణ దారులకు, అధికారుల మధ్య ఒప్పందాలు కుదిర్చే విధంగా చైన్ మెన్ లు వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారు మారుతున్నా రాజకీయ నాయకుల అండ ఉండటంతోనే అనేక ఫిర్యాదులొచ్చినా కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రం మారకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వ్యవహారంపై కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి మార్పు లేకపోవడంతో దుండిగల్ మున్సిపాలిటీలో అధికార దుర్వినియోగం జరుగుతుందని బహిరంగంగా అర్థమవుతుందని, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ స్పందించి దుండిగల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని మున్సిపల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here