Home తెలంగాణ 14వ వసంతంలోకి అడుగుపెట్టిన ఐఐటి చుక్కా రామయ్య గారి ఇష్టా విద్యాసంస్థలు

14వ వసంతంలోకి అడుగుపెట్టిన ఐఐటి చుక్కా రామయ్య గారి ఇష్టా విద్యాసంస్థలు

364
0

TGN NEWS (పటాన్ చేరు): ఐఐటి చుక్కా రామయ్య గారి ఇష్ట విద్యాసంస్థలు 13వ వసంతం పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇష్టా విద్యాసంస్థలు బీరంగూడ బ్రాంచ్ లో అమేధ హాస్పిటల్ యాజమాన్యం కలిసి ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమంలో ఇష్టా విద్యాసంస్థల సిబ్బంది రక్తదానం చేశారు, ఈ కార్యక్రమానికి అమేధ హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర గారు మాట్లాడుతూ ఇష్టా విద్యాసంస్థలు 14వ వసంతంలోకి అడుగుపెట్టినందుకు విద్యాసంస్థల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా ఇస్తా విద్యా సంస్థలు వేలమంది విద్యార్థులకు విద్యను అందిస్తుందని,30 మంది ఒక బ్రాంచ్ తో మొదలై ఇష్టా విద్యాసంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 10 బ్రాంచ్ లు పైగా విస్తరించి నాణ్యత మైన విద్యను అందించడం చాలా గర్వంగా ఉందని,మా విద్యాసంస్థలు ఈ స్థాయిలో ఉండేలా మమ్మల్ని నమ్మిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా మా అధ్యాపక బృందానికి మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా మా విద్యాసంస్థకు ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇష్టా విద్యాసంస్థల డైరెక్టర్ కె వినోద్ కుమార్ మరియు అకాడమిక్ ప్రేమ్ కుమార్ గారు 13 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ తులసి వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ రజిత వైస్ ప్రిన్సిపల్ విజయ్ భాస్కర్ రెడ్డి సంగారెడ్డి బ్రాంచ్ ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి,విద్యాసంస్థల ఫిజికల్ డైరెక్టర్ డి రమేష్ మరియు వెంకటరెడ్డి అడ్మిన్ వర్ష, హెచ్ ఓ డి వినోద్ కుమార్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here