Home తెలంగాణ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరణ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరణ

0

TGN NEWS (కొల్చారం): మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. అందులో భాగంగా శుక్రవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన కరపత్రికలను స్థానిక హనుమాన్ దేవాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులu గ్రామ ప్రజల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు బోద్ధుల రమేష్ బాబు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రంగంపేట గ్రామంలో దేవి నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో కొనసాగుతున్నాయని ఈ సంవత్సరం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 వసంతంలోకి అడుగుపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గోకరి రాజా గౌడ్ ,కామిని ప్రభాకర్ ,ముప్పిడి కృష్ణ, మహంకాళి సంతోష్,అరిగే విజయ్ కుమార్ ,ఊరడివిజయ ప్రకాష్ , ఆకుల నర్సింలు, మాలే వెంకటేశం, నీల కంటి రమేష్ ,జి ఎల్ కుమార్, కొమ్ముల రవీందర్ గౌడ్, సుధాకర్ ,తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version