Home తెలంగాణ లంచాల మత్తులో ప్రజల భద్రతను మరిచిన కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు

లంచాల మత్తులో ప్రజల భద్రతను మరిచిన కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు

0
  • కుత్బుల్లాపూర్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 25లో టౌన్ ప్లానింగ్ వ్యవస్థపై స్థానికుల ఆగ్రహం
  • ప్రజల భద్రతను మరచి అక్రమ కట్టడాలకు సహకరిస్తున్నారని మండిపాటు
  • అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారే చేతులెత్తేసిన వైనం
  • మాదృష్టికి రాలేదు చూస్తాం చూస్తాం అంటూ డిసి నరసింహ కాలయాపన

కుత్బుల్లాపూర్ జీహెచ్ ఎంసీ సర్కిల్ 25 పరిధి ప్రాగటూల్స్ కాలనిలో అనుమతులు లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో పది షెటర్లు, మొదటి అంతస్తులో మరో పది షెటర్ల భారీ కమర్షియల్ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది.

 టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

ఎలాంటి సెట్ బ్యాకులు, ఫైర్ సేఫ్టీ లేకుండా భవనం నిర్మిస్తున్నారని ప్రమాదం జరిగితే స్థానికంగా ఉండే తమ పరిస్థితి ఏంటని టౌన్ ప్లానింగ్ అధికారి మధుని, డిప్యూటీ కమిషనర్ నర్సింహా ని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారి మధుని అడగగా డిప్యూటీ కమిషనర్ ని అడిగి వివరాలు తెలుసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. అనుమతులకు లోబడి నిర్మాణాలు జరిగే విధంగా చూడాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తుందని, లంచాల మత్తులో ప్రజల భద్రతను మరిచి అడ్డగోలుగా నిర్మిస్తున్న కట్టడాలకు సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version