Home జాతీయం నకిలీ ఫైర్ ఎన్‌ఓసీతో గుర్తింపుకు యత్నం.. హైడ్రా చీఫ్ సంతకం ఫోర్జరీ కేసులో 8 కాలేజీలు

నకిలీ ఫైర్ ఎన్‌ఓసీతో గుర్తింపుకు యత్నం.. హైడ్రా చీఫ్ సంతకం ఫోర్జరీ కేసులో 8 కాలేజీలు

38
0

హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు తయారు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి నగరంలోని ఎనిమిది ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.

హైడ్రా అధికారుల పేర్లతో దొంగ సంతకాలు చేసి ఫేక్ ఎన్‌ఓసీలు సృష్టించిన ముఠా వ్యవహారం బోర్డు అధికారులు పత్రాల పరిశీలనలో బయటపడింది. అనంతరం హైడ్రా అధికారులు సంతకాలు నకిలీవని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై హైడ్రా అదనపు డైరెక్టర్లు లేక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ సంబంధిత కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోర్జరీ వెనుక ఉన్న ముఠా, పత్రాలు ఎలా తయారయ్యాయి, కళాశాలల పాత్ర ఏమిటి అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తావనలో ఉన్న కళాశాలలు:

  • శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (చాంద్రాయణగుట్ట)
  • రెసోనెన్స్ జూనియర్ కాలేజ్ (ఎస్‌ఆర్ నగర్)
  • హైందవి జూనియర్ కాలేజ్ (బర్కత్‌పుర)
  • ప్రియాం జూనియర్ కాలేజ్ (మెహదీపట్నం)
  • న్యూ ఎరా జూనియర్ కాలేజ్ (చిక్కడపల్లి)
  • మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ (విద్యానగర్)
  • షాహీన్ జూనియర్ కాలేజ్ (శివరాంపల్లి)
  • వశిష్ట జూనియర్ కాలేజ్ (తెల్లాపూర్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here