Home తెలంగాణ నర్సాపూర్ సీతారామరాజు కళాశాలలో పుస్తకాల అందజేత

నర్సాపూర్ సీతారామరాజు కళాశాలలో పుస్తకాల అందజేత

262
0

TGN NEWS ( నర్సాపూర్): అల్లూరి సీతారామరాజు కళాశాలకు పుస్తకాలను పంపిణీ చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి,, నర్సాపూర్ అల్లూరి సీతారామరాజు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు 119 పుస్తకాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1997లో కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే చిలుముల విట్టల్ రెడ్డి 22 ఎకరాలు సేకరించి పాఠశాలను స్థాపించడం ఎంతో గొప్ప విషయం అని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాల అని గుర్తు చేశారు. ఆ కాలంలో ఇంతటి దూర దృష్టితో ఆలోచించి ఇంత గొప్ప పాఠశాలను కళాశాలను స్థాపించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈ సమాజంలో చేసే మంచి పని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుందనీ మేము ఎప్పుడు వారి అడుగుజాడల్లో ఈ ఆశయాల కోసం పని చేస్తామని చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకు విద్య ఎప్పుడైతే గొప్పగా ఉంటుందో ఈ సమాజంలో కులాలను అంతరింప చేయవచ్చు అని చెప్పారు. ఈ కళాశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయి కూడా చేరుకున్నారని అదేవిధంగా మీరు కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలిపిచెడ్ మండల మాజీ జెడ్పిటిసి చిలుముల శేష సాయి రెడ్డి , సీనియర్ నాయకులు లక్ష్మికాంతారావు, మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్,నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, ప్రముఖ సంఘ సేవ అవార్డు గ్రహీత గంగాధర్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్, చిన్న చిన్నం రెడ్డి,చంద్రం కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గుప్తా గారు,సావిత్రి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,రాధాకృష్ణ, జంగం వెంకటేష్, రవి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,అభిప్ఖాన్,నాగేష్,రవి, సాయి చరణ్ గౌడ్,కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రాయ్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here