-
డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్
- 50 వేల మంది విద్యార్థులకు AI ఆధారిత విద్యా
మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వారు గూగుల్ తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరై డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ను జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇది భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50 వేల మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు AI ఆధారిత విద్యా పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల సర్టిఫికేషన్‌లు అందించబడనున్నాయి.

మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ క్యాంపస్, హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ చారిత్రాత్మక వేడుకలో 50 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగరేస్తూ ఈ డిజిటల్ భాగస్వామ్యానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మల్లారెడ్డి విద్యాసంస్థలు విద్యార్ధిని, విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, గూగుల్ సంస్థ నుండి మిస్టర్ వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్), మిస్టర్ సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్, ఎడ్‌టెక్స్) మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, చైర్మన్ చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.