TGN NEWS (నర్సాపూర్): అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి నష్టపోయిన బాధితకుటుంబాలకు ప్రభుత్వం అందించే సీ.ఎం.రిలీఫ్ ఫండ్ చెక్కులు కొంత బాసటగా నిలుస్తాయని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితారెడ్డి అన్నారు, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ₹₹2,19000/_రెండు లక్షల పందొమ్మిది వేల రూపాయల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే సునితారెడ్డి లబ్ధిదారుల కుటుంబసభ్యులకు నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు , సత్యం గౌడ్, షేక్ హుస్సేన్ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్,పిల్లి ఆనంద్ కుమార్, రాకేష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, గజ్జెల జగుపతి, విఠల్ గుప్త, నవీన్ గుప్త,వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
