TGN NEWS (దుండిగల్): మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ల ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేసారు సూరారం పి.యస్ పరిధి లో 3 వ తేదిన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు అరుణ్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి 31.176 గ్రాముల బంగారు,,, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం. చేసుకున్నారు దుండిగల్ పి.యస్ పరిధిలో ఏడవ తేదిన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు పాత నేరస్థుడు నీరుడి భూమయ్య అరెస్టు నిమిత్తం అతని వద్ద నుండి 25 గ్రాముల మంగళ సూత్రం స్వాధీనం చేసుకున్నారు ఆల్వాల్ పి.యస్ పరిధి ఏడవ తేది జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు నిరంజన్ రెడ్డి ని అరెస్టు చేసి అతని వద్ద నుండి పదహారు గ్రాముల బంగారం ఒక బైక్,,ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ మూడు కేసులను సిసి కెమరాల విజ్యువల్ ఆధారంగా కేసులను చేధించినట్లు డి సి పి ప్రెస్ మీట్ లో తెలిపారు..కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండుకు తరలించారు.
