Home బిజినెస్ బంగారం ధరలకు భారీ పతనం.. 4 రోజుల్లో రూ.9 వేల తగ్గుదల!

బంగారం ధరలకు భారీ పతనం.. 4 రోజుల్లో రూ.9 వేల తగ్గుదల!

12
0

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట లభిస్తోంది. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పడిపోతుండటంతో కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ విలువ బలపడటం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.9 వేల మేర తగ్గినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.

సెప్టెంబర్ 3న బంగారం ధరలు

గురువారం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,340గా కొనసాగుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010గా, 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా నమోదైంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,010గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,340గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,160గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,490గా కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

బంగారంతో పాటు వెండి ధరల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,49,900గా కొనసాగుతోంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉండగా.. బెంగళూరులో రూ.2,44,900గా నమోదైంది. బెంగళూరులో నిన్న కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా తగ్గింది.

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను చెక్ చేసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here