Home తెలంగాణ మల్లికార్జున్ నగర్ లండన్ ప్రీ స్కూల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

మల్లికార్జున్ నగర్ లండన్ ప్రీ స్కూల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

0

TGN NEWS (పటాన్ చేరు): సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో గల లండన్ ప్రీ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగగా పేరుగాంచిన బతుకమ్మను చిన్నారులు రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఆడిపాడారు. విద్యార్థులు జానపద గీతాలకు తాళం వేసి చిందులు వేయగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆహ్లాదంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జ్ఞానేశ్వరి, ఉపాధ్యాయులు రమ్యశ్రీ, గౌరీ, అనూష, సాయి లక్ష్మి పాల్గొని పిల్లలకు బతుకమ్మ పండుగ యొక్క సాంప్రదాయ ప్రాముఖ్యతను వివరించారు. బతుకమ్మ ఆడడం ద్వారా ఐక్యత, ఆనందం, పూల పరిమళాలతో నిండిన సాంస్కృతిక విలువలను చిన్నారులకు పరిచయం చేయడం ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version