Home తెలంగాణ మువ్వన్నెల వెలుగుల్లో మహాదేవుడు.. ఆదియోగి దృశ్యం చూపుతిప్పుకోనివ్వదు

మువ్వన్నెల వెలుగుల్లో మహాదేవుడు.. ఆదియోగి దృశ్యం చూపుతిప్పుకోనివ్వదు

14
0

కోయంబత్తూరు: చీకటి పడింది.. మువ్వన్నెల కాంతులు వెలిగాయి.. 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం దేదీప్యమానంగా మెరిసిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో కనిపించిన ఈ అద్భుత దృశ్యం సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది.

జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఆదియోగి విగ్రహంపై ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఆదియోగి రూపం.. దేశభక్తిని చాటే త్రివర్ణ కాంతులతో మరింత ప్రత్యేకంగా కనిపించింది.

విగ్రహాన్ని వీక్షించిన భక్తులు, పర్యాటకులు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. భారతమాతకు జయజయధ్వానాలు చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటుకున్నారు.

జాతీయ పండుగల సందర్భంగా ఆదియోగి విగ్రహాన్ని ప్రత్యేక కాంతులతో అలంకరించడం ఈశా కేంద్రంలో ఆనవాయితీగా వస్తోంది. ఈసారి త్రివర్ణ కాంతుల్లో మెరిసిన ఆదియోగి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here