Home తెలంగాణ మేడ్చల్ సర్కిల్ 299 డివిజన్ కండ్లకొయ్యలో అక్రమణీర్మణం…!

మేడ్చల్ సర్కిల్ 299 డివిజన్ కండ్లకొయ్యలో అక్రమణీర్మణం…!

129
0
  • చిరు వ్యాపారులపై ఉక్కుపాదం…!
  • బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనం…!

299 డివిజన్ కండ్లకొయ్యలో నిర్మిస్తున్న అక్రమణీర్మణం

TGN న్యూస్ (మేడ్చల్): GHMC పరిధిలోని మేడ్చల్ సర్కిల్-229 డివిజన్‌లో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్టీల్ట్ ప్లస్ రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి తీసుకున్న ఓ నిర్మాణదారుడు అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నాడనే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో రోడ్ల పక్కన చిన్న గుడారాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులపై మాత్రం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెలవు దినాలు, తెల్లవారుజామున సమయాల్లో సైతం జేసీబీలతో వచ్చి వారి గుడారాలను తొలగిస్తున్న అధికారులు, కళ్లముందే జరుగుతున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. “రోజువారీ కూలి, చిన్న వ్యాపారాల ద్వారా కుటుంబాలను పోషిస్తున్న మా వంటి వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ కోట్ల రూపాయల విలువైన అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న వారిపై మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారు?” అంటూ పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు తరచూ మారడం, పర్యవేక్షణ లోపించడం వల్లే కింది స్థాయి సిబ్బందికి ఇలాంటి అక్రమాలకు అవకాశం లభిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నగర ప్రణాళిక వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని స్థానికులు అంటున్నారు. కాబట్టి GHMC ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మేడ్చల్ సర్కిల్-229 డివిజన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులను తొలగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here