యూపీఐ పేమెంట్స్ చేసే వారికి కీలక సమాచారం. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం.
ఇకపై ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్.. అంటే MDR విధించనున్నారు.
అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన పర్సన్-టు-మర్చంట్.. P2M యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR వసూలు చేసే ప్రతిపాదన ఉంది.
అయితే ఇందులో వినియోగదారులకు ఊరట ఉంది. ఈ ఛార్జీని కస్టమర్ల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి వసూలు చేయనున్నారు. రూ.75 వేలకుపైగా విలువైన లావాదేవీలకు గరిష్ఠ MDRను రూ.300కు పరిమితం చేయనున్నారు.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
గోల్డ్‌మన్ శాక్స్ అంచనా ప్రకారం.. ఈ విధానం ద్వారా ఏటా రూ.20,600 కోట్ల వరకు ఆదాయం రావచ్చు.
మోర్గాన్ స్టాన్లీ ప్రకారం.. కొన్ని డిజిటల్ పేమెంట్ సంస్థల EBITDA 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 38 నుంచి 48 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
UBS మాత్రం ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేసింది. ఇందులో 60 నుంచి 70 శాతం వరకు బ్యాంకులకు, మిగిలిన మొత్తం డిజిటల్ పేమెంట్ సంస్థలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.
ఇక JP Morgan, Citi సంస్థలు సైతం సుమారు రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని విశ్లేషించాయి.
అయితే ఈ మొత్తం ఆదాయం యూపీఐ వ్యవస్థలోని బ్యాంకులు, అప్లికేషన్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాముల మధ్య ఏ విధంగా పంపిణీ అవుతుందనే దానిపైనే ఎవరికెంత ప్రయోజనం దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది.
యూపీఐ ఛార్జీలపై తాజా పరిణామాలు.. మరిన్ని వివరాల కోసం BC7 Newsను ఫాలో అవ్వండి.





