Home తెలంగాణ రూ.15 వేలలో 6,500mAh బ్యాటరీ.. రియల్‌మీ కొత్త ఫోన్‌లో ఇంకేం ఉన్నాయి?

రూ.15 వేలలో 6,500mAh బ్యాటరీ.. రియల్‌మీ కొత్త ఫోన్‌లో ఇంకేం ఉన్నాయి?

18
0

రియల్‌మీ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ ‘సీ100ఐ’ను విడుదల చేసింది. 6,500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే ఈ ఫోన్‌ ప్రధాన ఆకర్షణలు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో రియల్‌మీ సీ100ఐ ధర రూ.14,999గా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులకు రూ.250 కూపన్‌ డిస్కౌంట్‌ ఇస్తోంది. మిడ్‌నైట్‌ బ్లాక్‌, స్కైలైన్‌ సిల్వర్‌ రంగుల్లో ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ అందించారు. 6,500mAh బ్యాటరీకి 15W వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. యూనిసాక్‌ టీ7250 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత రియల్‌మీ యూఐతో వస్తోంది.

వెనుకవైపు 8 మెగాపిక్సెల్‌ కెమెరా, ముందు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌తో పాటు 64జీబీ స్టోరేజ్‌ లభిస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here